అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం

అక్కడికక్కడే ఒకరు మృతి,

మరొకరికి తీవ్ర గాయాలు

మొయినాబాద్‌: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన కృష్ణ (50), అదే గ్రామానికి చెందిన నర్సింహ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి మొయినాబాద్‌ వైపు బైక్‌పై వెళ్తున్నారు. అజీజ్‌నగర్‌ రెవెన్యూలో ఉన్న రాణే ఇంజన్‌వాల్స్‌ కంపెనీ వద్దకు రాగానే మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయాలైన నర్సింహను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement