శంకర్‌పల్లి: విభిన్న రంగాలకు చెందిన విద్యార్థులు సమష్టి బాధ్యతలు చేపట్టడం ద్వారా యువత శక్తివంతంగా తయారవుతారని ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్‌పర్సన్ శోభారాణి యశస్వీ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అపరాజిత అండర్ గ్రాడ్యుయేట్ క్లబ్’ని ఆమె రిజిస్ట్రార్ విజయలక్ష్మితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇది ఒక అధికారిక విద్యార్థి క్లబ్ అని, భిన్న రంగాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒకేచోట తమ అభిప్రాయాలు, ఆసక్తులు, అభిరుచులు తెలుసుకొని, సమష్టిగా పని చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొ.మహేంద్ర హెచ్.సోనావానే, కో–ఆర్డి నేటర్లు డా.చెంజి, ప్రొ.వి.పద్మావతి, డా.టి.నేహా తదితరులు పాల్గొన్నారు.
ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్‌పర్సన్ శోభారాణి


