నర్సు శిరీష హత్య ప్రదేశంలో వివరాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

నర్సు శిరీష హత్య ప్రదేశంలో వివరాల సేకరణ

Sep 8 2026 7:15 AM | Updated on Sep 8 2026 7:15 AM

మహేశ్వరం: తుక్కుగూడలోని ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రిలో నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రదేశాన్ని సోమవారం గాంధీ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఇందిర, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్‌ నిపుణులు, వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించడంతో హత్య జరిగిన ప్రదేశంలో వివరాలు సేకరించారు. నర్సు నివాసం ఉన్న గది, చుట్టూ పరిసరాలు, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, గది డోర్లు, కిటికీలు, గ్రిల్స్‌తో పాటు హంతకుడు పనిచేసిన మెకానిక్‌ షెడ్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలోని వైద్యులు, శిరీష స్నేహితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన నర్సులు ఉంటున్న గదులను పరిశీలించి, ప్రతీ అంశాన్ని రికార్డు చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మహేశ్వరం తహసీల్దార్‌ చిన్న అప్పల నాయుడు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement