గ్రీవెన్స్‌లో స్పందించకపోవడంతో.. | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌లో స్పందించకపోవడంతో..

Sep 8 2026 7:15 AM | Updated on Sep 8 2026 7:15 AM

గ్రీవెన్స్‌లో స్పందించకపోవడంతో.. ఎన్నిసార్లు తిరిగినా పని కావడం లేదు

హస్తినాపురంలో ఉంటున్నాం. డబుల్‌బెడ్‌రూం కోసం దరఖాస్తు చేశాం. నా పేరున స్థిరచరాస్తులు లేవు. నెల రోజుల క్రితం నాపేరు లిస్ట్‌–2లో ఉండగా, తాజాగా లిస్ట్‌–3లోకి మారింది. అదేమంటే కారు ఉన్నట్లు చూపిస్తున్నారు. నిజానికి నాపేరున కానీ, నా భర్త పేరున కానీ ఎలాంటి వాహనాలు లేవు. గ్రీవెన్స్‌లో ఇదే అంశాన్ని లేవనెత్తాను. అక్కడ ఎలాంటి స్పందన లభించకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చాను.

– శాలిని, ఓంకార్‌నగర్‌

తక్కెళ్లపల్లి రెవెన్యూ సర్వే నంబర్‌ 348లో 1.10 ఎకరాల భూమి ఉండగా, దీనిలో 24 గుంటలే పట్టాదారుపాసు పుస్తకంలో ఎక్కించారు. సర్వే నంబర్‌ 343లో 30 గుంటల భూమికి ఆరు గుంటలే నమోదైంది. మిగిలిన భూమిని రికార్డు చేయాల్సిందిగా అనేకసార్లు తహసీల్దార్‌కు విన్నవించినా పని కాలేదు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్‌ను ఆశ్రయించాను. ఇప్పటికే నాలుగు విడతలు తిరిగినా పని కాలేదు. అధికారుల చుట్టూ తిరిగితిరిగి మోకాళ్లు అరిగిపోయాయి.

– బింగి అయిలయ్య, నక్కర్తమేడిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement