షాద్‌నగర్: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. సో మవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యంలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ అయిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. స్పీకర్‌పై కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రా జ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలన్నారు.
శంకర్‌పల్లి: అక్రమ లేవుట్లలో నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. జన్వాడ రెవెన్యూలో అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు, నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఈనెల 6న ‘నిబంధనలు నిల్.. వెంచర్లు ఫుల్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్, హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించారు. సదరు నిర్మాణాలను సోమవారం కూల్చివేశారు. అన ంతరం నా ర్సింగి అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి ప్ర సీదా, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రమేశ్ మా ట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు, నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కందుకూరు: బంజారాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా సమాజానికి మంత్రి వర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ఫ్యూచర్‌సిటీలో 20 ఎకరాలు కేటాయించి, అందులో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు జీఓ నంబర్ 641ను రద్దు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చించి బంజారా సమాజానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హనుమాన్ నాయక్, ప్రధాన కార్యదర్శులు నరేష్ నాయక్, కాట్రావత్ హనుమంత్ నాయక్, అధికార ప్రతినిధి ఇస్లావత్ సురేష్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాపియా నాయక్ పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్‌లోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రష్మితను రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు వరించింది. ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సహా 9 మంది విద్యార్థునులకు ఎంబీబీఎస్, 11 మంది బీడీఎస్, ముగ్గురికి ఐఐటీ, 150 మంది విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కాయి. మొత్తంగా మంచి ఫలితాలు సాధించినందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2018లో నాగార్జునసాగర్‌లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా ఎంపికయ్యారు. అనతి కాలంలోనే ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. 2021లో పరిగిలో పని చేశారు. తర్వాత సరూర్‌నగర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకల్లో భాగంగా సీఎం చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపాల్‌కు ఉత్తమ అవార్డు రావడంపై తోటి అధ్యాపకులు సహా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.


