సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇటీవల మండల, రెవెన్యూ కేంద్రాలకూ విస్తరించింది. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి 80 నుంచి 100 మంది వస్తున్నారు. వీరిలో 60 శాతం భూ బాధితులే. ఈ రెండేళ్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయి.. ఎన్ని పరిష్కరించారంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఫిర్యాదులు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదు. చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణికి పోటెత్తుతున్న వినతులు
మొక్కుబడిగా అధికారుల చర్యలు
పరిష్కారం కాని సమస్యలు
మళ్లీమళ్లీ తిరుగుతున్న బాధితులు


