‘చలో హైదరాబాద్‌’ జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘చలో హైదరాబాద్‌’ జయప్రదం చేయాలి

Sep 8 2026 7:15 AM | Updated on Sep 8 2026 7:15 AM

షాద్‌నగర్‌రూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌ను’ విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్‌ యశ్వంత్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం టీజీఈ జేఏసీ జిల్లా జనరల్‌ సెక్రటరీ నర్సింలు ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధాయుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం యశ్వంత్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు గొంతెమ్మ కోరికలను కోరడంలేదని, ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఇస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీని చెల్లిస్తామని, సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి ఏపీఎస్‌ను అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న సరెండర్‌, మెడికల్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు, కో చైర్మన్‌ గోపాల్‌నాయక్‌, కో కన్వీనర్‌ వెంకటప్ప, తహసీల్దారు నాగయ్య, ఎంపీడీఓ శ్రీకాంత్‌, ఎంపీఓ జయంత్‌రెడ్డి పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్‌ యశ్వంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement