కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని మహేహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలతో పాటు నేరాల నియంత్రణ, స్నేహపూర్వక పోలీసింగ్, సమయపాలన, బాధ్యతాయుతంగా విధుల నిర్వహణపై సిబ్బందితో మాట్లాడారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, నిఘా వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించి, నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పిర్యాధు దారులతో మర్యాదగా వ్యవహరించి, చట్ట ప్రకారం త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి


