చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కొత్తగా వేస్తున్న ఆర్‌ఎంసీ రెడీమిక్స్ ప్లాంట్ పనులను వెంటనే నిలిపివేయాలని స్థానిక ప్రజలు, కౌన్సిలర్ మధుసూదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరికి, తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రాలు అందజేశారు. వార్డులో ఏర్పాటు చేస్తున్న క్రషర్‌కు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. దీనివల్ల ఇళ్లల్లోకి దుమ్ముధూళి రావడంతో పాటు చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుగుట్ట ప్రజలు, తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌కు వినతి


