ఇబ్రహీంపట్నం: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగివేసారిపోయారని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తిరిగిరావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తప్పుచేశామన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించాలన్న ముఖ్యమంత్రి ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శిలాఫలకాలతో కాలం వెళ్లదిస్తున్నాడే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు కృపేశ్, ఇందిర, పార్టీ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, రాజు నాయక్, బుగ్గరాములు, రమేష్‌గౌడ్, చీరాల రమేష్, కిషన్‌గౌడ్, జగదీశ్వర్, అల్వాల వెంకట్‌రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


