కడ్తాల్: కోతుల బెడదతో మండలంలోని చల్లంపల్లి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి సామగ్రిని చిందవందర చేయడంతో పాటు అందిన వాటిని ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్లపై.. వీధుల్లో పదుల సంఖ్యలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక భయాందోళనకు గురవుతున్నారు. పలువురిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వానర మూకను అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.


