సృజనాత్మకత పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత పెంపొందించుకోవాలి

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

శంకర్‌పల్లి: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చలపతి రావు, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 11వ మూట్‌ కోర్టు పోటీలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు హాజరై చివరి రౌండ్‌కి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలుగా పారుల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, రన్నరప్‌గా ఎస్‌వీకేఎం స్కూల్‌ ఆఫ్‌ లా విద్యార్థులు నిలిచారు. వీరికి అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ.. న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఓపిక, శోధన వంటివి ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, వాదనలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి, ఇక్ఫాయ్‌ లా స్కూల్‌ డైరెక్టర్‌ ప్రొ.రవి శేఖరరాజు, డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ.విజయేందర్‌ కుమార్‌, మూట్‌ కోర్టు సొసైటీ సభ్యురాలు డా.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement