మొయినాబాద్: ప్రైవేటు హాస్టల్ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు కాలిపోయి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆగిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో హాస్టల్ భవనంలో సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తప్పిన పెను ప్రమాదం


