బషీరాబాద్: మండల పరిధిలోని మైల్వార్‌లో రేకుల డబ్బా ధ్వసం ఘటన వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు కందనెల్లి నగేశ్ స్వయం ఉపాధి కోసం రూ.1.50లక్షలు వెచ్చించి బస్టాండ్ సమీపంలో జిరాక్స్, స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గత నెలలో షాపు ఏర్పాటుకు సర్పంచ్‌కు రాతపూర్వకంగా దరఖాస్తు చేశానని, పంచాయతీ కార్యదర్శి మౌఖిక సూచనల మేరకే డబ్బా ఏర్పాటు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో సర్పంచ్ సీమా సుల్తానా అనుచరులు ప్రారంభానికి ముందే డబ్బాను ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డబ్బా ఏర్పాటు చేసి తమపై దాడికి యత్నించాడని సర్పంచ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్‌ఐ విఠల్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యా ప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ దుద్యాల, బొంరాస్‌పేట మండలాల నాయకులతో కలిసి పాత పోలీసు స్టేషన్ నుంచి భూలక్ష్మి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, తనకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం చుట్టుకుందని విమర్శించారు. సీఎం వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులపై నిర్భందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని రానివ్వకుండా తిరగబడే రోజులొస్తాయని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి తమ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. వందకోట్లు సీఎం ఫ్యామిలీకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రస్తుతం ఇళ్లు, పెన్షన్లు, ఫైరవీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు.
● రూ.1.50 లక్షల పెట్టుబడి బూడిద
● పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు


