షాద్‌నగర్: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు ఆధు నిక సాంకేతికతతో కూడిన స్మార్టు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ కార్టు ద్వారా డూప్లికేషన్‌కు అవకాశం లేకుండా మరింత పారదర్శకంగా సేవలు అందుతాయన్నారు. అర్హులైన ప్ర తీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


