మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలుకూరులో నవమి రోజు వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయం ముందు ఉట్టి కొట్టారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ కృష్ణాష్టమి విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, మాజీ సర్పంచ్ సంగెరి మల్లేశ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు జనార్ధన్‌రెడ్డి, యాదగిరి, నర్సింహగౌడ్, రాజేశ్, అర్చకులు పాల్గొన్నారు.


