ఈడిన్ ఈజిఫ్టై(టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాల(ప్లేట్స్‌లెట్స్) సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. తాగునీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, చెట్లపొదలను శుభ్రం చేయడం, పూల కుండీల్లో నీటినిల్వ లేకుండా చేయడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు. జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారికి వైద్య పరీక్షలు సహా అన్ని రకాల మందులు అందజేస్తున్నాం. ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందిపడటం కంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించి, సకాలంలో చికిత్సలు పొందడం ఉత్తమం.
– డాక్టర్ డి.స్వర్ణకుమారి, డీఎంహెచ్‌ఓ


