కలెక్టర్ నారాయణరెడ్డి
తుక్కుగూడ: చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన ట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. ఒంటరి మహిళ పెన్షన్ కోసం తహసీల్దార్, ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, లోకల్ ఎంకై ్వరీ రిపోర్టు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ వివరాలు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులు సదరం పత్రాన్ని దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో పెన్షన్ వచ్చి, పలు కారణాల వల్ల నిలిచిపోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కల్లుగీత కార్మికులు తప్పకుండా ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు. చేనేత కార్మికులు ఏ.డీ హ్యండ్లూమ్స్ శాఖ అధికారులు ఇచ్చిన కార్డును ఇవ్వాలన్నారు. దరఖాస్తు సమయంలో సందేహాలు ఉంటే 92475 24051 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
డిప్యూటీ సీఎంను కోరిన చేవెళ్ల ఎమ్మెల్యే
షాబాద్: బడుగుల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రె స్ ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం ఆయన సర్ధార్‌నగర్ ఏఎంసీ చైర్మన్ సురేందర్‌రెడ్డితో కలిసి సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయాలని చెప్పారు. ఏట్ల ఎర్రవల్లి చిన్న వాగు బ్రిడ్జికి నిధులు సరిపోక పనులు మధ్యలోనే ఆగిపోయాయని దాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన యువకుడు
మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద శనివారం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ ఈ పరీక్షలను పర్యవేక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కేసు నమోదు చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికోసం వచ్చిన ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సతీశ్‌ను నెట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. అతని తరపున ఓ కౌన్సిలర్ వచ్చి యువకుడిని తీసుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను నెట్టివేసి దురుసుగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేయకుండా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
షాద్‌నగర్ రూరల్: పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ సమక్షంలో హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ ఏఈ బాలయ్య పార్టీలో చేరారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల్లో బహుజనులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సబ్బండ వర్గాలకు సమన్యాయం బీఎస్పీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింలు, కుమార్, మహేందర్, చెన్నయ్య, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.


