చేవెళ్ల: చేవెళ్ల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ జిల్లాకు వెళ్తూ మార్గమధ్యలో చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతావెంకట్‌రెడ్డి ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేవెళ్ల అభివృద్ధి, నిధులు, ఎన్‌హెచ్–163 రోడ్డు పనుల పురోగతిపై చర్చించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారాని చర్యలు తీసుకుంటాన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు శైలజరెడ్డి, ఎం.శ్రీనివాస్, కృష్ణానాయక్, గోపాల్‌రెడ్డి, కళ్యాణి, మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, నాయకులు ఆగిరెడ్డి, వసంతం, ఎం.యాదగిరి, శ్రీను, కర్నె శివప్రసాద్, ఖదీర్‌పాషా, తదితరులు ఉన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


