టూరిస్ట్‌ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యం | - | Sakshi
Sakshi News home page

టూరిస్ట్‌ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యం

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

హుడాకాంప్లెక్స్‌: టూరిస్ట్‌ సీఎంను నమ్ముకుంటే ప్రయోజనం శూన్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్‌నగర్‌ డివిజన్‌ కొత్తపేట చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు వరకు యువజన నాయకులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని అన్నారు. స్వయాన సీఎం విద్యా శాఖ మంత్రి అయి ఉండి కూడా పాలిటెక్నిక్‌ విద్యార్థులపై నిరంకుశంగా వ్యవరిస్తునారని దుయ్యబట్టారు. తక్షణమే వీరి సమస్యను ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ నగర్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్‌ నగర్‌ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్‌ శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి అరవింద్‌ శర్మ, బీఆర్‌ఎస్‌ నాయకుడు దర్పల్లి అశోక్‌, యువజన నాయకులు కొండల్‌ రెడ్డి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement