బడంగ్‌పేట్: నాదర్‌గుల్‌లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం దక్షిణ మధ్య క్షేత్ర సమితి ఖేల్ ఖూద్–26 క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీబీఎస్‌ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి జంగం సునీల్‌కుమార్, ఇస్రో పూర్వ సైంటిస్ట్ పద్మశ్రీ జ్ఞానగాంధీ, వనమాలి ఆర్గానిక్ డైరెక్టర్ రాజయ్య, మాజీ ఐఏఎస్ ఉమామహేశ్వర్‌రావు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరస్వతి విద్యాపీఠం పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు తొలుత అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతరం అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆటల పోటీలు ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘటన తెలంగాణ కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, క్రీడల ప్రముఖ్ సత్యనారాయణ, విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కాసోజు భూషన్, వీబీవీకే పాఠశాల అధ్యక్షుడు రమేష్‌గుప్తా, ఉపాధ్యక్షుడు బస్సు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి విష్ణువర్థన్‌రాజు, కృష్ణారెడ్డి, కోశాధికారి కొండ కల్యాణ్, సభ్యులు సునీత, వెంకటేశ్వర్‌రావు, పాఠశాల ప్రిన్సిపాల్ కరణాకర్ తదితరులున్నారు.
సీబీఎస్‌ఈ బోర్డు డిప్యూటీ కార్యదర్శి సునీల్‌కుమార్


