శంకర్‌పల్లి: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కొండకల్ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం ఉదయం 11.30కి హైదరాబాద్–వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్ను హుస్సేన్ సాగర్ రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి(25) మృతి చెందాడు. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


