కేశంపేట: స్థానిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న విద్యావతి ఉత్తమ జీహెచ్‌ఎంగా, పాపిరెడ్డిగూడ, కొత్తపేట, నిర్ధవెళ్లి హైస్కూళ్లలో పనిచేస్తున్న ఆనంద్‌బాబు, హారతి, కరుణాకర్‌గౌడ్, కేశంపేట, పాపిరెడ్డిగూడ, మంగళిగూడ, కేశంపేట, అల్వాల ప్రాథమిక పాఠశాలలకు చెందిన అప్పారావు, అరుణ, లక్ష్మీశిరీష, అపర్ణ, శ్రీధర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. శనివారం మధ్యాహ్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళాశాల మంగళ్‌పల్లి, ఇబ్రహీంపట్నం వద్ద పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.


