నిందితులిద్దరూ తండ్రీకొడుకులు
ఇబ్రహీంపట్నం రూరల్: సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో హుండీ దొంగిలించిన దొంగలను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం.. కాలీవాల రోహిత్ (28), కాలీవాల సోమ్రాజ్ (60) తండ్రీకొడుకులు. అల్లం వెల్లుల్లి, పండ్ల వ్యాపారం చేస్తూ లాల్‌దర్వాజ సమీపంలో నివసిస్తున్నారు. గత నెల 26న సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో నగదుతో పాటు హుండీని దొంగిలించారు. దర్యాప్తు చేపట్టిన ఆదిభట్ల క్రైం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారించారు. బొంగ్లూర్ సమీపంలో తిరుగుతుండగా క్రైం ఎస్‌ఐ నోయల్‌రాజ్ బృందం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వీరి నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం, రూ.12,120 నగదు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్‌పై గతంలో పలు దేవాలయాల్లో 17కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ నోయల్‌రాజ్, హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్, సిబ్బంది కిరణ్‌రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్, శివ చంద్ర, సంతోష్, సందీప్, భరత్‌ను సీఐ అభినందించారు.
అనంతగిరి: అత్వెల్లికి చెందిన రోజువారీ కూలీ మొగులయ్య(35) మద్యానికి బానిసై గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని వికారాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


