కావాలి సారూ.. మీవంటి వారు | - | Sakshi
Sakshi News home page

కావాలి సారూ.. మీవంటి వారు

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

కావాలి సారూ.. మీవంటి వారు

పూడూరు: సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే శక్తి వీరికి మాత్రమే సాధ్యం. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్ది అనేక అవార్డులు అందుకున్న వారిలో పూడూరు మండలం కంకల్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వర్‌రావు ఒకరు. ఎక్కడ పని చేసినా తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాతల సహకారంతో స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతూ, నూతన ఒరవడితో బోధన చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన వీరన్నపేట్‌ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండగా, దాతల చేయూతతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వైటెక్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, వాటర్‌ ప్యూరిఫయర్లు, కళావేదికల నిర్మాణం, స్పోర్ట్స్‌ మెటీరియల్‌, స్మార్ట్‌ టీవీలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. కరోనా సమయంలో రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు బోధించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కంకల్‌ పాఠాశాలలో విద్యార్థుల సంఖ్యను 119 నుంచి 157కు పెంచడంలో తోటి ఉపాధ్యాయులతో కలిసి తీవ్రంగా శ్రమించారు. మండల, జిల్లా స్థాయి రిసోర్స్‌ పర్సన్‌గా నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరం.

అందుకున్న అవార్డులు..

● మండలస్థాయి అవార్డు 2019

● మనం మన ఊరి బడి రాష్ట్రస్థాయి అవార్డు 2021

● డాక్టర్‌ ఎన్టీఆర్‌ జాతీయ కీర్తి పురస్కారం 2022

● రాష్ట్రస్థాయి ట్రాన్స్ఫార్మింగ్‌ ఎడ్యుకేటర్‌ అవార్డు 2022

● ఆచార్యదేవోభవ జాతీయ అవార్డు 2022

● బెస్ట్‌ అకడమిక్‌ రిసోర్స్‌ టీచర్‌ అవార్డు 2022

● అబ్దుల్‌ కలాం నేషనల్‌ లెవెల్‌ టీచింగ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు 2022

● గురుస్పందన అవార్డు 2023

● గుజరాత్‌ మంథన్‌ శిక్షక్‌ పురస్కారం 2023

● వికారాబాద్‌ జిల్లాస్థాయి అవార్డు 2025

● బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ టీచర్‌గా ఢిల్లీకి ఎంపిక 2025

● టీఎల్‌ఎం మేళాలో మండల, జిల్లా స్థాయి ప్రథమ పురస్కారాలు

● అకాడమిక్‌ ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీంలో చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement