కందుకూరు: మండల పరిధిలోని 13 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో వి.అంజయ్య(కందుకూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం), ఓ.శ్రీనివాస్‌శర్మ(నేదునూరు ఉన్నత హెచ్‌ఎం), జి.సంజీవరెడ్డి(ఆకులమైలారం ఉన్నత), ఎన్.కల్పనగౌడ్(రాచులూరు జెడ్పీహెచ్‌ఎస్), కె.శ్రీధర్, కె.హరిప్రసాద్(మీర్‌ఖాన్‌పేట ఉన్నత), వై.శ్రీనివాస్‌రావు(లేమూరు ఉన్నత), కె.వెంకటరమణ, ఎల్.శేఖర్(నేదునూరు మోడల్), బి.సువర్ణ(కందుకూరు ఎంపీపీఎస్), సీహెచ్ కళావతి(ఎంపీపీఎస్ పులిమామిడి), ఎస్.నజీర్‌హుస్సేన్(దాసర్లపల్లి యూపీఎస్), డి.రంగనాథ్(మాదాపూర్ యూపీఎస్) ఉన్నారు.


