ఆత్మహత్య చేసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

ఆత్మహత్య చేసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

సకాలంలో స్పందించి యువకుడిని కాపాడిన పోలీసులు

యాచారం: ప్రేమ విఫలమై తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించిన పోలీసులు అతడిని కాపాడారు. వివరాలివీ.. మహేశ్వరం మండలం కోళ్లపడకల్‌ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్‌ (23) బోనాల పండుగ సందర్భంగా గ్రీన్‌ ఫార్మాసిటీ పీఎస్‌ పరిధిలోని తన మేనమామ గ్రామమైన ముచ్చర్లకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇది గుర్తించిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పోలీసులు పోస్టుపెట్టిన యువకుడు గ్రీన్‌ ఫార్మాసిటీ పీఎస్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, ఆ పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అక్కడి ఎస్‌ఐ సైదులు సిబ్బందితో కలిసి కిషోర్‌ ఉన్న స్థలం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ప్రేమలో విఫలం కావడంతోనే మనస్తాపానికి గురై చనిపోవాలనుకున్నట్లు తెలిపాడు. కిషోర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement