ఒకరి అరెస్టు
ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం 1.245 కిలోగ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా జరుగుతుందని అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి కవర్ పట్టుకుని రావడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు. అతడి నుంచి 1.245 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన రాజన్‌సింగ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజన్‌సింగ్‌ను అరెస్టు చేశారు. గంజాయిని దూల్‌పేటకు చెందిన అంగోరిబాయి నుంచి కొనుగోలు చేశాడని ఎస్‌ఐ తెలిపారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుల్ హిమవంతరావ్, కానిస్టేబుల్ జాషువ, రమేశ్, కురుమయ్య, బానుప్రకాశ్, సంజీవరెడ్డి ఉన్నారు.


