తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ 43వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలు దాటి తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అంబోజీ శ్రీకాంత్ యాదవ్ ఇంట్లో ప్రతిష్ఠించిన అమ్మవారి ఘటాన్ని మీగడ కాశీనాథ్ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, తీగల కృష్ణారెడ్డి తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్‌రావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
హాజరైన ప్రముఖులు


