పనిచేసే చోటే కుప్పకూలి మేసీ్త్ర మృతి | - | Sakshi
Sakshi News home page

పనిచేసే చోటే కుప్పకూలి మేసీ్త్ర మృతి

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

మొయినాబాద్‌: బతుకుదెరువుకోసం భార్యపిల్లతో వలస వచ్చిన ఓ మేసీ్త్ర పనిచేసే చోటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన బుధ్రం సత్నామి (54) నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి మొయినాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాడు. మున్సిపల్‌ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న వనమ్‌ విల్లాస్‌లో మేస్త్రిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పనిచేస్తూ సత్నామి తల తిరుగుతోందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement