తాండూరు రూరల్: జీవితంపై విరక్తిచెంది ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మృతుడు తాండూరు మండలం అంతారం వాసిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొర్ర నాగప్ప (35) భార్యాపిల్లలతో కలిసి బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నివాసముంటున్నాడు. సోమవారం సాయంత్రం బేగంపేట్ స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా, కింద పడ్డాడు. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు సాయంతో రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
కుత్బుల్లాపూర్: మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.9 కిలోల ఆల్ఫాజోలమ్, కారు, బైక్, రూ. 40 వేల నగదుతోపాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు కామారెడ్డికి చెందిన మాజీ ఎకై ్సజ్ కానిస్టేబుల్ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. కామారెడ్డి జిల్లాకు చెందిన గొల్ల రమేష్ గతంలో ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అతను కల్లు వ్యాపారి నాతి చంద్రాగౌడ్, డ్రైవర్లు సందిళ కృష్ణ, కుమ్మరి సాయిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కుచి విశ్వనాథంతో కలిసి ముఠా ఏర్పాటు చేసి కొంతకాలంగా మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తూ నగరంలో విక్రయిస్తున్నాడు. గత 31న కొంపల్లి జయభైరి పార్కు వద్ద ముగ్గురు అల్ఫాజోలమ్ విక్రయించేందుకు వస్తున్నారని సమాచారం అందడంతో పేట్‌బషీరాబాద్ ఎస్‌ఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కృష్ణ, సాయిలు, విశ్వనాథంలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గొల్ల రమేష్, చంద్రాగౌడ్‌లను కూడా అరెస్టు చేశారు. నిందితులను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
● ఇద్దరు ఏపీ రైతుల అరెస్టు
అమీర్‌పేట: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో విక్రయించేందుకు తీసుకువచ్చిన రూ.21.37 లక్షల విలువ చేసే హష్ ఆయిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు చినబులుడు గ్రామ నివాసి పొద్దు మోహన్‌రావు (41) డుంబ్రిగుడ మండలం పాతలంటి గ్రామానికి చెందిన టి.బిస్తుదాస్(27) రైతులు. మోహన్‌రావు అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎంచుకున్నాడు. ఆగస్టు 30 ఒడిశాలో 1.710 లీటర్ల హష్ ఆయిల్ కొనుగోలు చేసి 31వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు బిస్తుదాస్‌తో కలిసి సికింద్రాబాద్‌కు రైలులో వచ్చారు. ఆటోలో ఎస్‌ఆర్‌నగర్‌కు చేరుకుని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో వినియోగదారుడి కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు.


