చేవెళ్ల: పట్టణంలో కళాశాల విద్యార్థులకు వసతి గృహాలను వెంటనే నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్లలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్లలో వసతి గృహాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 2018లోనే ఎస్సీ, బాలుర, బాలికల కళాశాలల వసతి గృహాలు మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటివరకు పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించారని వాపోయారు. మంజూరైన వసతిగృహాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సరైన సవతి లేక ఇబ్బందులు పడుతున్నారని, అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుందని తెలి పారు. ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి వెంటనే వస తిగృహాల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేసి, రోడ్డు దిగ్భందాలు భారీ నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాల చందు, నాయకులు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన


