ఖర్గేను కలిసిన స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఖర్గేను కలిసిన స్పీకర్‌

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

ఖర్గేను కలిసిన స్పీకర్‌ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడి బలవన్మరణం సైదాబాద్‌: బాలిక ఆత్మహత్య కేసు నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో నివసించే బాలిక ప్రైవేట్‌ వీడియోలతో కొందరు బ్లాక్‌మెయిల్‌ చేయగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతల్‌బస్తీకి చెందిన ఎం.మహేశ్‌ (20)ను సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మహేష్‌ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతగిరి: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మంగళవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌ కమిటీ హాల్‌లో జరిగే కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్‌ సన్నాహక సమావేశం కోసం స్పీకర్‌ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకటేశం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గూడెం మైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి

మేడ్చల్‌: ఔటర్‌ రింగు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని మరో లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నె నుంచి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు ప్లైవుడ్‌ లోడ్‌తో వెళ్తున్న లారీని డ్రైవర్‌ కండ్లకోయ వద్ద సర్వీసు రోడ్డుపై నిలిపి ఉంచారు. చిరుజల్లులు రావడంతో బిహార్‌కు చెందిన డ్రైవర్‌ బిహరీ రాయ్‌(35) లారీపైకెక్కి టార్పాలిన్‌ కవర్లు కప్పుతున్నాడు. అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్‌ వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొనడంతో బిహారిరాయ్‌ కింద పడి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement