ఇంద్రసేనారెడ్డి సేవలు ఎనలేనివి | - | Sakshi
Sakshi News home page

ఇంద్రసేనారెడ్డి సేవలు ఎనలేనివి

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

ఇబ్రహీంపట్నం: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, నిజాయతీగా వ్యవహరిస్తూ గుర్రం ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా (అబ్దుల్లాపూర్‌మెట్‌) ఉద్యోగ విరమణ చేసిన గుర్రం ఇంద్రసేనారెడ్డితోపాటు ఆయన సతీమణి శ్రీవాణిని సన్మానించి, అభినందనలు తెలుపుతూ మంగళవారం పెద్ద అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఎలాంటి మచ్చ లేకుండా సమర్థవంతంగా ఇంద్రసేనారెడ్డి విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబంతోపాటు సమాజంపై ప్రేమ, అనుబంధం కలిగిన ఇంద్రసేనారెడ్డితో తమకు విడదీయరాని బంధం ఉందన్నారు. విధి నిర్వహణతోపాటు సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇకపై కూడా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువ ఉద్యోగులు ఇంద్రసేనారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, రిటైర్డ్‌ ఈఎన్‌సీ (ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) కనకరత్నం, రామ్మోహన్‌రావు, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement