చందానగర్: అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ శివాజీనగర్‌లో నివాసముండే సారా సాయిరాం(39) మెడికల్ రిప్రజెంటేటివ్. చందానగర్‌లోని శాంతినగర్‌కు చెందిన కుంచల రవీంద్ర (25) జిమ్ ట్రైనర్. సాయిరాం తరచూ హిమాచల్ ప్రదేశ్ నుంచి స్టెరాయిడ్స్ తీసుకువచ్చి రవీంద్రకు విక్రయించేవాడు. వాటిని జిమ్‌కు వచ్చే కస్టమర్లకు రవీంద్ర విక్రయించేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున చందానగర్ పీజేఆర్ స్టేడియం పక్కన స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్‌సీపురం ఎస్‌ఓటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. సుమారు రూ.1,02,150 విలువ చేసే 10 మిల్లిలీటర్ల 227 ఇంజక్షన్లు, వైద్య బిల్లులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని చందానగర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
1.02 లక్షల విలువ చేసే ఇంజక్షన్ల స్వాధీనం


