షాబాద్: పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్‌లో సోమవారం పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపల్లి పెంటారెడ్డి సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా కార్యకర్తలంతా ఏకతాటి పైకి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి పామెన భీంభరత్, సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరు మల్లేష్, గౌరీసతీష్, మొయినాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్, చేవెళ్ల సహకారం సంఘం చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి


