కాంగ్రెస్‌ మోసాలపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మోసాలపై పోరుబాట

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై బీఆర్‌ఎస్‌ చేపట్టనున్న పోరుబాటను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ పరిధిలోని శేరిగూడలో సోమవారంపార్టీ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ప్రజలకిచ్చి న 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని.. అధికారం చేపట్టి 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆ పార్టీ హామీలపై సెప్టెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం తదితర అంశాలపై ప్రజలకు అర్థమయ్యేవిధంగా వివరించాలన్నారు. పోరుబాటను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement