తాండూరు టౌన్: ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన నిందితున్ని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలో నివాసం ఉంటున్న పట్లోళ ఉమాదేవి ఇంటికి శనివారం గతంలో ఆమె వద్ద పనిచేసిన పనిమనిషి భర్త మొగులప్పతో పాటు మరో వ్యక్తి వచ్చారు. ఆమె మెడకు చీరకొంగు బిగించి, స్పృహ తప్పిన తర్వాత మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం విధితమే. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే ఇద్దరు నిందితుల్లో ఒకరైన సంజీవ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఐదున్నర తులాల మంగళసూత్రం, నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మొగులప్ప పరారీ ఉన్నట్లు చెప్పారు. సంజీవ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
నిందితుడికి రిమాండ్


