ధారూరు: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న అనుమానంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది డీసీఎంను స్వాధీనం చేసుకొని, ధారూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీల్లో 100 క్వింటాళ్ల బియ్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని గుర్తించారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఉన్న 25 కిలోల చొప్పున ఉన్న బస్తాలను పరిశీలించారు. అనంతరం సీఐ రఘురామ్, సివిల్ సప్‌లై డీటీ రసీద్‌లకు ఆ వ్యానును అప్పగించగా.. వారు బియ్యంను పరిశీలించి, శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకెళ్లారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక వాస్తవం మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.


