బంట్వారం: కేసులు పెండింగ్ పడకుండా చూడాలని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య అన్నారు. సోమవారం ఆయన కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రతలను కాపాడుతూనే.. నేరాలను నియంత్రించాలని సూచించారు. రాత్రి వేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ధారూరు సీఐ రఘురాములు, కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ పాల్గొన్నారు.
ఏజీవర్సిటీ: ఏజీవర్సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజెమెంట్ (నారమ్స్) 51వ ఫౌండేషన్ డే వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ సుందరం తెలిపారు. ఐసీఏఆర్ ఆధ్వర్యంలో 1976లో రాజేంద్రనగర్‌లో ఏర్పాటైన ఈ అత్యున్నత సంస్థ, వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ బ్యాంకుల్లో లభించిన నకిలీ నోట్లపై ఆర్‌బీఐ ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఒకే లావాదేవీలో నాలుగు కంటే ఎక్కువ నోట్లు లభించడంతో ఎన్‌ఎస్ వర్మను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆర్‌బీఐ అధికారులు అందించిన 10 నోట్లలో తొమ్మిది రూ.100 నోట్లు, ఒకటి రూ.500 నోటు ఉంది. వీటిని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సాక్షి, సిటీ బ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్, జాతీయ స్వర్ణ పతక విజేత ప్రణవ్ మాధవ్ సూరపనేనిని సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) కార్యాలయంలో చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్–ఎండీ సోని బాలదేవి అభినందించారు. ఇటీవల ఏషియన్ షార్ట్ ట్రాక్ చాంపియన్‌షిప్‌లో ప్రణవ్ రజతం, రెండు కాంస్య పతకాలు సాధించాడు. 2030 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే వీలు కల్పించే సీనియర్ వరల్డ్ టూర్‌కూ అర్హత సాధించాడు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణతో పాటు దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసి నేపథ్యంలో ఆయనను శాట్జ్ చైర్మన్, ఎండీ ప్రశంసించారు. ప్రణవ్ మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని శివసేనారెడ్డి ఆకాంక్షించారు. ఆర్థిక సాయం అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రణవ్ భవిష్యత్ అంతర్జాతీయ పోటీలు, శిక్షణ అవసరాలు, దీర్ఘకాలిక క్రీడా లక్ష్యాలను వివరించారు. ప్రణవ్ ఉన్నత స్థాయి శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన అంశాలను సోని బాలదేవి అడిగి తెలుసుకున్నారు.
గంజాయి చాక్లెట్ల విక్రేతకు జైలు
చార్మినార్: బీహార్‌కు చెందిన రబింద్రా బెహరా (42) అనే నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు కాంప్లెక్స్‌లో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వాణి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల నగదు జరిమానాను విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. 2018లో కాటేదాన్ ప్రాంతంలో 5.6 కిలోల అక్రమ గంజాయి చాక్లెట్ల రవాణా, అమ్మకం కేసులో పట్టుబడ్డాడు. పీపీ మంజుల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.


