పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు కందుకూరు ఠాణాలో మూడు వదిలేసిన బైక్‌లు

పహాడీషరీఫ్‌: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్‌.బి.నగర్‌ న్యాయస్థానం సోమవారం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన ప్రకారం.. 2023 డిసెంబర్‌లో ఎర్రకుంటకు చెందిన ఆటోడ్రైవర్‌ ముఖరం(26) 16 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతిని రక్షించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను విచారించిన రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు.

కందుకూరు: కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో వదిలేసిన మూడు బైక్‌లు ఉన్నాయని, వాటి యజమానులు ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలని సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ11ఎస్‌0823, ఏపీ09బీఏ3645, ఏపీ13జీ8807 నంబర్లు ఉన్న వాహనాలకు సంబంధించిన యజమానులు వాహ న రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకొచ్చి సమర్పించి బైక్‌లు తీసుకెళ్లాలన్నారు. సంబంఽధిత వాహన యజమానులు వీలైనంత త్వరగా ఠాణాలో సంప్రదించాలని లేదంటే వాహనాలను నిబంధనల ప్రకారం వేలం వేస్తామన్నారు.

వ్యక్తికి జైలు శిక్ష

బంట్వారం: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ విమల తెలిపారు. కోట్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన బంటు రమేష్‌.. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ బంట్వారం తనిఖీలో పట్టుబడ్డారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, సోమవారం కోర్టులో హాజరు పర్చగా.. వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement