షాద్‌నగర్: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కొప్పునూరి శ్రీశైలం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని కేకేఆర్ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాలశ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీశైలం దంపతులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. విద్యారంగాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శశిరేఖ యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి


