ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

మొయినాబాద్‌: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌ హెచ్చరించారు. సోమవారం మొయినాబాద్‌ బస్టాప్‌లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, రోడ్లు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించాలన్నారు. పాదచారులు రహదారికి ఎడమవైపునే నడవాలని సూచించారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని.. ట్రిపుల్‌ రైడింగ్‌, అతివేగం, ప్రమాదకరమైన ఓవర్‌టెక్‌లు చేయొద్దన్నారు. మద్యం సేవించి, మొబైల్‌ ఫోన్‌లు మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని చెప్పారు. ఈ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంగించినవారిపై కేసులు నమోదు చేశారు.

చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement