ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. తాళ్లపల్లి కరుణాకర్ (38) అనే వ్యక్తి నాలుగేళ్లుగా రావిర్యాల సమీపంలోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం బైక్‌పై డ్యూటీకి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తూ తుక్కుగూడ సమీపంలో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో ఉన్న ఏషియన్ పెయింట్స్ దగ్గర నిలిపి ఉన్న బొలేరా వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కరుణాకర్ తలకు బలమైన గాయం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భార్య దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంబరు మార్చి..
ఏమార్చి తిరుగుతూ..
వాహనం పట్టివేత
శంషాబాద్: ఈఎంఐలు, పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబరు మార్చి.. పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న ఓ వాహనాన్ని ఆర్‌జీఐ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్‌జీఐఏ ట్రాఫిక్ సీఐ ప్రమోద్‌కుమార్ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్‌జీఐఏ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ట్రంపెట్ బ్రిడ్జీ ఇండియానా బేకరి వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా వాహనం కనిపించింది. పరిశీలించగా ట్యాక్సీగా రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్ రమేష్ తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


