ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

ఆరు కార్లు దగ్ధం..

15 మందిని సురక్షితంగా తరలింపు

ఫిలింనగర్‌: ఫిలింనగర్‌లోని జర్నలిస్ట్‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న వంశీరామ్స్‌ జ్యోతి డ్వెల్లింగ్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టిల్ట్‌ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులుగా ఉన్న ఈ నివాస భవనంలోని స్టిల్ట్‌ ఫ్లోర్‌లో పార్క్‌ చేసి ఉన్న ఆరు కార్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. పంజగుట్ట ఎంటీపీ, అన్నపూర్ణ వాటర్‌ బౌజర్‌, జూబ్లీహిల్స్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న 15 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement