మాజీ మంత్రిసబితారెడ్డి హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రిసబితారెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Aug 20 2026 7:26 AM | Updated on Aug 20 2026 7:26 AM

మాజీ మంత్రిసబితారెడ్డి హౌస్‌ అరెస్ట్‌

మహేశ్వరం: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని బుధవారం పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆస్పత్రి సందర్శనకు బయలుదేరిన ఆమెను పోలీసులు శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో ఉదయం గృహ నిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు పెద్దఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్బంధాలు, హౌస్‌ అరెస్ట్‌లు చేయడం సరికాదన్నారు. టిమ్స్‌ ఆస్పత్రిలో డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే హౌస్‌ అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement