మువ్వన్నెల అలంకరణలో మామిడిపల్లి ఆంజనేయస్వామి | - | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల అలంకరణలో మామిడిపల్లి ఆంజనేయస్వామి

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

పహాడీషరీఫ్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మామిడిపల్లిలోని దాసాంజనేయ దేవాలయంలో స్వామి వారిని శనివారం మువ్వన్నెల జెండా రూపంలో అలంకరించారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉండే సింధూరంతో పాటు మధ్య భాగంలో తెలుపు రంగు పూల తో, కింది భాగంలో తమలపాకులతో అలంకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన రూపా న్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరంగా శివయ్య

మొయినాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజున చిలుకూరులో మువ్వన్నెల అలంకరణలో శివుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవరణలో ఉన్న శివాలయంలో సుందరేశ్వరస్వామి (శివుడు)ని పూలు, పత్రి (ఆకు)తో జాతీయ జెండా రంగులతో అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

జమీల్‌ బాషాకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ఇబ్రహీంపట్నం: వినోబానగర్‌లోని ఆక్టోపస్‌ 3వ టీజీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ సయ్యద్‌ జమీల్‌ బాషా ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. నగరంలోనిగోల్కొండ కోటలో శనివారం జరిగినస్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు పతకం అందజేశారు. ఈ సందర్భంగా బాషాను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.

అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేలా పనిచేద్దాం

కందుకూరు: ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఎదుట మొదటిసారి కమిషనర్‌ శశంక జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపా రు. అందరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా పని చేద్దామని పిలుపునిచ్చారు.

అంకితభావంతో పనిచేయాలి

ఇబ్రహీంపట్నం: కొత్త ఆలోచనలు, ఆధునిక పద్ధతులతో సమర్థవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ డా. తరుణ్‌ జోషి అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానర్‌లో గల ఆక్టోపస్‌లోకి ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ను మార్చుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్‌, సేఫ్‌, సెక్యూర్‌ పోలీసింగ్‌, ప్రజల భద్రత, వృతిపరమైన సేవలు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలతో ఫ్యూచర్‌ సిటీ పోలీసులు పునరంకితం కావాలన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డికి ఉత్తమ సేవా పతకాలు అందించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement