ఇబ్రహీంపట్నం: సర్ ప్రక్రియకు సమయం లేదు, తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు వెంటనే బీఎల్‌వోలకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ సూచించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ జాబితా కార్యక్రమంపై అఖిలపక్ష నేతలు, బీఎల్‌వోలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు ఈనెల 10న చివరి తేదీ కావడంతో ఆలోపు ఫారాలను అందజేయాలని లేకుంటే ఓటర్ జాబితాలో పేరుండదని తెలిపారు. మున్సిపాలిటీ ఓటర్ జాబితాలో 26,410 మంది ఉంటే అందులో 70.8 శాతం ఓటర్లే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటశివలింగం, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి


