పల్లెవించేలా..
‘కొత్త’ కోలాహలం
నూతన సంవత్సర వేడుకలను జిల్లావాసులు ఘనంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి కేక్‌లు కట్‌చేసి.. బాణసంచా కాల్చి.. పార్టీల్లో మునిగి తేలారు. గురువారం వేకువజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా కోలాహలం కనిపించింది.
నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ప్రకటించారు. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున విడుదల చేస్తామన్నారు. సీఎం ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– షాద్‌నగర్/షాబాద్
పంచాయతీలకు రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేక ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయి పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధుల్లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే పంచాయతీలకు సైతం సీఎం ఫండ్ నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కొడంగల్ సభలో ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిధులు మంజూరైతే పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అడుగుపడే అవకాశం ఉంది.
ఎదురు చూస్తున్న సర్పంచ్‌లు
పెద్ద పంచాయతీలు తప్ప మిగితా పంచాయతీల ఖజానాలో డబ్బులు లేవు. బాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేక పలువులు సర్పంచ్‌లు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ కొనుగోలుకు సొంత డబ్బులు వెచ్చించారు. తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు, మోటార్ల నిర్వహణ, ట్రాక్టర్ల మరమ్మతుల కోసం నిధులు లేవు. ప్రత్యేక నిధులు వస్తే కొన్ని పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధుల కోసం కొత్త సర్పంచ్‌లు ఆశగా ఎదురు చూస్తున్నారు.
రూ.42కోట్ల స్పెషల్ నిధులు
జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన రూ. 42 కోట్ల మేర నిధులు రానున్నాయి. దీంతో గ్రామాల్లో తిష్ట వేసిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరకనుంది.
ప్రణాళికలు.. తీర్మానాలు
ప్రత్యేక అభివృద్ధి నిధులతో పల్లెల్లో చేపట్టే పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇందు కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో అభివృద్ధి పనులపై సర్పంచులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త పాలక వర్గాలతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి తీర్మానాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ది పనులు చేపట్టనున్నారు.
గ్రామాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
– వాకిటి నవకిరణి, సర్పంచ్, ఎలికట్ట, ఫరూఖ్‌నగర్
రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి కొంత కుంటుపడింది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతాం. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు ఖర్చు చేస్తాం.
– అంజయ్య, సర్పంచ్, ముట్పూరు, కొందుర్గు
ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.10 లక్షలతో కొంతైనా అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికై తే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలు చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం.
– కేతావత్ రాజునాయక్, సర్పంచ్ మద్దూరు, షాబాద్
పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, కార్యదర్శులు చేసిన పనులకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన కొంత ఊరటనిచ్చింది.
– కుమ్మరి లావ్యణ, సర్పంచ్, సంకెపల్లిగూడ, షాబాద్
పంచాయతీలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్
నేరుగా గ్రాంట్లు విడుదల చేస్తామన్న సీఎం
జిల్లాకు రానున్న రూ.42కోట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న కొత్త పాలక వర్గాలు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కొత్త సర్పంచ్‌లు
జిల్లాలో మొత్తం జీపీలు – 526
చిన్న పంచాయతీలు – 210
పెద్ద పంచాయతీలు – 316
పల్లెవించేలా..
పల్లెవించేలా..


