సీఎంను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మహేశ్వరం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి గురువారం కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కందుకూరు: నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు జానకీరెడ్డి, చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం రాత్రి 12 గంటలకు మండల పరిధిలోని కొత్తూర్ గేట్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం సీఐలు సీతారామ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు జంక్షన్ సమీపంలో..
కొత్తూరు: పట్టణంలోని నాట్కో జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఫ్యూచర్‌సిటీ పోలిస్ కమిషనర్ సుధీర్‌బాబు పాల్గొన్నారు. శంషాబాద్, మహేశ్వరం డీసీపీలు రాజేష్, నారాయణరెడ్డితో కలిసి ఆయన కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్ చౌరస్తాలో..
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో పోలీసులు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌బాబు కేక్ కట్‌చేసి అందరిలో ఉత్సాహం నింపారు. రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్‌గౌతమ్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి


